ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వాళ్లను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వారి బలహీనతే స్కామర్లకు బలంగా మారుతోంది. దాదాపు ప్రస్తుతం మనం వాడే సోషల్ మీడియా యాపులలో మన స్నేహితులు మాత్రమే కాదు. తెలియని ఎంతో మంది ఉంటారు. అలాంటి వారు పలు రకాల స్కామ్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
snap chat: స్నాప్ చాట్.. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారందిరీ పరిచయం అక్కర్లేని యాప్. దీంట్లో గేమ్స్, ఫోటోస్, వీడియోస్, ఎడిటింగ్ లాంటి చాలా ఫీచర్లు ఉన్నాయి. యూత్ ఈ యాప్ లో ఫుల్ టైం పాస్ చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు యువతను టార్గెట్ చేస్తున్నారు. వారి భవిష్యత్ ను నాశనం చేస్తున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వాళ్లను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వారి బలహీనతే స్కామర్లకు బలంగా మారుతోంది. దాదాపు ప్రస్తుతం మనం వాడే సోషల్ మీడియా యాపులలో మన స్నేహితులు మాత్రమే కాదు తెలియని ఎంతో మంది ఉంటారు. మనకు తెలియని వాళ్లు కూడా మనతో మెసేజ్, వీడియో కాల్స్ చేస్తుంటారు. ఆ సమయంలోనే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మన నుంచి తస్కరిస్తుంటారు. ఏ మాత్రం ఆదమరచి ఉన్నా వాళ్ల ఉచ్చులో చిక్కుకోవడం ఖాయం. అకౌంట్ హ్యాకింగ్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడుతుంటారు. ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది.
ఇంత వరకు సోషల్ మీడియాలో దేంట్లో లేని విధంగా ఓ ఫీచర్ స్నాప్ చాట్లో ఉంది. అదే మెసేజ్ డిసప్పియర్ ఆప్షన్. ఈ ఆప్షన్ తో మనం ఎవరితోనైనా చాట్ చేసిన తర్వాత ఆ చాటింగ్ వివరాలు తిరిగి తీసుకురావడం అసంభవం. మీ పిల్లలు ఫోన్ వాడుతున్నప్పుడు వారిని పర్యవేక్షించినప్పటికీ వారు ఇతరులకు ఏం పంపుతున్నారో తెలుసుకోవడం అసాధ్యం. స్నాప్మ్యాప్ ద్వారా మనం ఎక్కడున్నది సైబర్ నేరగాళ్లు తెలుసుకునే వీలుంది. దాంతో బెదిరింపులకు పాల్పడి కిడ్నాప్ చేసే ఆస్కారం కూడా ఉంది. యువత చాలా మంది ఈ యాప్ ను శృంగారం కోసం వినియోగిస్తున్నారు. దాదాపు 1.6 యూజర్స్ ఈ యాప్ ను శృంగారం కోసం ఉపయోగిస్తున్నట్లు సీటెల్ పసిఫిక్ విశ్వవిద్యాలయం సర్వేలో వెల్లడైంది. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ఎంత పరిచయం ఉన్న వారికైనా పర్సనల్ ఫోటోలు, శృంగార మెసేజ్ లు పంపవద్దు. అలాగే వీడియో కాల్స్ చేయవద్దు. అపరిచితులతో పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, బ్యాంకు వివరాలు షేర్ చేయొద్దు. ఈ యాప్ ద్వారా పరిచయమైన వారిని కలవాల్సి వస్తే పబ్లిక్ ప్లేసులో మీటింగ్ పెట్టుకోవడం ఉత్తమం. వీలైతే మరొకరిని తోడుగా తీసుకెళ్లండి.