»Drunk Driving Killed Three People In Visakhapatnam
Accident: మద్యం మత్తులో కారు నడిపి ముగ్గురి ప్రాణాలు తీశారు
మద్యం తాగిన మత్తులో కారును నడిపి రోడ్డుమీద హల్చల్ చేసిన యువకులు. స్పీడ్‌గా దూసుకొచ్చిన కారుతో చెట్టును ఢీ కొట్టారు. ఆ తరువాత అదపుతప్పి అటుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.
Road accident on Gorakhpur Kushinagar highway six people dead and 27 injured
Drunk: విశాఖపట్టణం-భీమిలి(Visakhapatnam-Bheemili) మార్గంలో గతరాత్రి మద్యం మత్తు(Alcohol intoxication)లో కారు నడిపిన కొందరు యువకులు విధ్వంసం సృష్టించారు. సాగర్ నుంచి ఎండాడ వైపు వెళ్తున్న కారు రాడిసన్ హోటల్ మలుపు వద్ద డివైడర్‌ను ఆ తర్వాత చెట్టును ఢీకొట్టి అదుపు తప్పి రొడ్డుకు అటువైపు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు.
ఈ ఘటనలో బైక్‌పై ఉన్న పృథ్వీరాజ్ (28), ప్రియాంక (21) దంపతులు స్పాట్లోనే మరణించారు. వీరిది ఒడిశాలోని రాయగడగా గుర్తించారు. పృథ్వీరాజ్ ఓ సంస్థలో సైట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఇదే ప్రమాదంలో కారులో వెనుక సీటులో కూర్చొన్న ఎం.మణికుమార్ (25) తీవ్రంగా గాయపడి కారులోనే మృతి చెందాడు. అయితే మొత్తం కారులో ప్రమాదం జరిగే సమయంలో ఆరుగురు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. కారులో ఇద్దరు వ్యక్తుల తీవ్రంగా గాయపడ్డారు. ఇంకో ముగ్గురు వ్యక్తులు పరారీ అయినట్లు తెలుస్తుంది. ఆ ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనకు ముందు కారులోని యువకులు సాగర్‌నగర్ ఆర్చ్ వద్ద కొంత మంది యువకులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో మద్యం సీసాలను రోడ్డుమీదనే పగలగొట్టి నానా హంగామా చేశారు. అంతేకాదు యువకుల దగ్గర నుంచి ఫోన్లను లాక్కుని అక్కడి నుంచి వెళ్లారు. కారులోనే తాగుతూ రచ్చ చేశారు. ఈ క్రమంలో కారు ముందు డివైడ్రను ఢీ కొట్టి, పక్కనే చెట్టుకు బలంగా తాకడంతో కారు అదుపు తప్పి రోడ్డుకు అవతలి వైపు వస్తున్న బైక్‌ను ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ముగ్గురు వ్యక్తుల కోసం గాలింపు చర్యాలు చేపట్టారు.
విశాఖలో మద్యం మత్తులో కారుతో గుద్ది యువ జంట ప్రాణాలు తీసిన యువకులు
బీచ్ రోడ్డులోని రాడిసన్ బ్లూ వద్ద మద్యం మత్తులో అరుగులు యువకులు కారు నడుపుతూ భీభత్సం సృష్టించారు. అతివేగంతో ఉన్న కారు అదుపు తప్పి డీవైడరును ఢీ కొట్టి, పక్క రోడ్డులో వెళ్తున్న మరో బైకును ఢీ కొట్టగా బైక్ మీద ఉన్న… pic.twitter.com/vm45amz4Z1