»Kodali Nani Said That Pawan Kalyan And Chandrababu Will Be Stripped Of Their Clothes And Made To Stand On The Road
Kodali Nani: బాబు, పవన్ ను బట్టలుడదీసి రోడ్డుపై నిలబెడతా
ఎన్టీరామారావుకే వెన్నుపోటు పొడిసిన ఘనత చంద్రబాబుకు ఉందని, అతను ఎవరినైనా అవసరాలకు వాడుకొని పక్కన పెడతాడని కొడాలి నాని పేర్కొన్నారు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ మార్పు తీసుకొస్తామంటే స్వాగతిస్తామన్న నాని చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే బట్టలు ఊడదీసి రోడ్డుమీద నిలబెడుతామని అన్నారు.
Kodali Nani said that Pawan Kalyan and Chandrababu will be stripped of their clothes and made to stand on the road.
Kodali Nani: వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతల్లో ఒకరైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరి మీద హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు రక్తంలోనే వెన్నుపోటు, అవసరం కోసం వాడుకోవడం ఉందని పేర్కొన్నారు. ఎన్టీరామారావుకు అన్యాయం చేసి కూర్చి లాక్కున్నాడన్నారు. అదే విధంగా చంద్రబాబుతో కలిస్తే పవన్ కి.. ఎన్టీఆర్ కి పట్టిన గతే పడుతుందని కొడాలి నాని అన్నారు. జనసేన పార్టీ పెట్టి కొత్త రాజకీయాలను తీసుకొస్తా అంటే తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు పవన్ ప్రజల్లో తిరగవచ్చు, జగన్ మీద విమర్శలు చేయవచ్చు. కానీ ముందుగా రాజకీయాల్లో ఉండే దొంగలు, 420లను పక్కన పెట్టాలని సలహా ఇచ్చారు. పవన్ ప్రజల మధ్య వారాహి యాత్ర చేస్తే ఇబ్బంది ఏమీ లేదని ఆయనతో నేరుగా కలిసి మాట్లాడే అవకాశం కుదరలేదని అందుకే మీడియా ముఖంగా చెబుతున్నానని అన్నారు.
చంద్రబాబును సీఎంగా చూడాలని కోరుకునే వారు పవన్ కు మద్దతు దారులుగా మారారని, పవన్ మద్దతుతో చంద్రబాబుని ప్రతిపక్ష నేతగా చేయాలని వారు భావిస్తున్నారని నాని తెలిపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మద్దతుదారులతో కలిసి పవన్ మాపై దాడి చేస్తే ఊరుకోమన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ పవన్ అమలు చేస్తే రాజకీయంగా ఎదుర్కొంటామని పేర్కొన్న ఆయన..చంద్రబాబుకు సపోర్ట్ చేసే వారు ఎవరైనా ఒక కూటమిగా చూస్తామని, బట్టలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతాం అంటూ ఘాటుగా వ్యాఖ్యనించారు. గతంలో టీడీపీ నుంచి రాజకీయ అరంగ్రేటం చేసిన కొడాలి నాని 2014 వైసీపీ కండువా కప్పుకొని రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
పవన్ కళ్యాణ్‌కు కొడాలి నాని వార్నింగ్
చంద్రబాబుకు మద్దతు ఇస్తే పవన్ కళ్యాణ్‌ను బట్టలూడదీసి రోడ్డు మీద నిలబెడతాం – కొడాలి నాని pic.twitter.com/ZCTy0HPsfW