Snake Cow Viral Video: కలిసి ఆడుకుంటున్న ఆవు, పాము.. వీడియో వైరల్
వైరల్ వీడియోలో ఒక ఆవు బహిరంగ ప్రదేశంలో నిలబడి ఉంది. దానికి ఎదురుగా ఒక పాము తన పడగ విప్పి నేలపై కూర్చుని ఉంది. ఈ వీడియోలో ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు, ప్రేమ కనిపిస్తుంది. పాము తన పడగ పైకి లేపింది. ఎదురుగా ఒక ఆవు వాసన చూస్తోంది.
Snake Cow Viral Video: వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అదే విధంగా ప్రస్తుతం పాము, ఆవు ప్రేమతో ఆడుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాము తన దూడలా లాలించడం కనిపిస్తోంది. నిజానికి దాని స్వభావం ప్రకారం.. పాము ఆవుపై దాడి చేయాలి. కాటేయ్యాలి. కానీ అది జరగకపోవడం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో జనాలకు విపరీతంగా నచ్చింది.
వైరల్ వీడియోలో ఒక ఆవు బహిరంగ ప్రదేశంలో నిలబడి ఉంది. దానికి ఎదురుగా ఒక పాము తన పడగ విప్పి నేలపై కూర్చుని ఉంది. ఈ వీడియోలో ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు, ప్రేమ కనిపిస్తుంది. పాము తన పడగ పైకి లేపింది. ఎదురుగా ఒక ఆవు వాసన చూస్తోంది. ఆ తర్వాత ఆవు తన నాలుకను చాపి పాము ముఖాన్ని నాలుకతో నాకడం ప్రారంభిస్తుంది. పాము ఏమాత్రం ఉద్వేగానికి లోనైనట్లు లేదు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ సుశాంత్ నందా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో చర్చనీయాంశమైంది. ఈ వీడియోలో పాము, ఆవు మధ్య ప్రేమ కనిపిస్తుంది. ఈ దృశ్యం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే ఈ రెండు జీవుల మధ్య ఇలాంటివి మీరు ఇంతకు ముందు చూసి ఉండరు. వీడియోను పంచుకుంటూ.. సుశాంత్ ఇలా వ్రాశాడు- “ఈ సన్నివేశాన్ని వివరించడం కష్టం. ఈ నమ్మకాన్ని స్వచ్ఛమైన ప్రేమతో గెలుచుకున్నారు.
చాలా మంది ఈ వీడియోపై కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. సుశాంత్ చెప్పింది పూర్తిగా కరెక్ట్ అని ఒకరు అన్నారు. మరొకరు ఆవు, పాము రెండూ అనవసరంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తున్నాయని.. వాటికి స్వంత భాష ఉందని అది మానవులకు అర్థం కాదని ఒకరు రాసుకొచ్చారు.