విశాఖ 89వ వార్డు ఆదర్శనగర్ పేలుడు స్థలాన్ని సోమవారం ప్రభుత్వ విప్ గణబాబు పరిశీలించారు. జనావాసాల్లో ఉన్న అక్రమ నిల్వలపై వెంటనే ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు ప్రభుత్వ సహాయం అందేలా నష్టాన్ని అంచనా వేయాలని అధికారులకి సూచించారు.