మొబైల్ ఫోన్లను అమితంగా ఇష్టపడేవారికి ఆగస్టు నెలమొత్తం ఓ పండగనే చెప్పాలి. ఎందుకంటే ప్రముఖ మొబైల్ కంపెనీలు వివిధ మోడల్స్‌ను తమ వినియోగదారుల కోసం ఈ నెలలోనే మార్కెట్లో విడుదల చేయనున్నాయి
ఎంతో కాలంగా ఊరిస్తూ వస్తోన్న వన్‌ప్లస్ (Oneplus Open)మడత ఫోన్ ఎట్టకేలకు ఆగస్టు నెలలో మార్కెట్లోకి రానుంది. ఆగస్టు 29న వన్‌ప్లస్ ఫోల్డింగ్ ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. వన్‌ప్లస్ ఓపెన్ లేదా వన్‌ప్లస్ 11 ఫోల్డ్ పేరుతో ఈ ఫోన్ మార్కెట్లోకి రాబోతుంది. ఫోన్ తెరిచినప్పుడు 7.8 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, మూసినప్పుడు 6.3 అంగుళాల డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉపయోగించారు. వెనుకవైపు 64 ఎంపీ ట్రిపుల్ కెమెరాలు ఇస్తున్నారు. 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. రేటు రూ.లక్ష ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.
రియల్మీ జీటీ నియో
144 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీంతోపాటు మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌తో కూడా ఫోన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. వెనుకవైపు 50 ఎంపీ ట్రిపుల్ కెమెరాలు ఇస్తున్నారు. 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ, 240 వాట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఆగస్టు లాస్ట్ వీక్‌లో రిలీజ్ కానుంది. దీని వెనుక భాగం నథింగ్ ఫోన్ తరహాలో డిజైన్ చేశారు.
టెక్నో పోవా 5 సిరీస్
నథింగ్ ఫోన్ డిజైన్ ప్రేరణతో వస్తోన్న మరో మోడల్ టెక్నో పోవా 5 సిరీస్. దీన్ని రెండు వేరియంట్లలో తీసుకొస్తున్నారు. టెక్నో పోవా 5, (Tecno Pova 5 Series)టెక్నో పోవా 5 ప్రో. వీటిలో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. కెమెరా, డిస్ప్లే ఇతర వివరాలు తెలియాల్సివుంది. ఈ ఫోన్ వెనుకవైపు నథింగ్ ఫోన్ తరహాలో ఎల్ఈడీ లైట్స్ ఇస్తున్నారు. ఆగస్టు రెండు లేదా మూడో వారంలో టెక్నో పోవా 5 రిలీజ్ కానుంది.
బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రాండ్ రెడ్మీ(Redmi 12 5G) మరో నూతన మోడల్‌ను తీసుకురానుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో ఫోన్ పనిచేస్తుంది. 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.79-అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆగస్టు పస్టు వారంలో ఈ ఫోన్ విడుదలకానుంది. ఇదే ఫీచర్లతో పొకో బ్రాండ్ కింద ఫొటో ఎమ్6 ప్రో మోడల్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ
జులైలో మడత ఫోన్లను విడుదల చేసిన శాంసంగ్ ఆగస్టులో మిడ్‌రేంజ్ మోడల్‌ను పరిచయం చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీలో (Samsung Galaxy F34 5G)120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. కెమెరా, ఇతర వివరాలు తెలియాల్సివుంది.
పొకో ఎఫ్ 5 సిరీస్
ఈ సిరీస్‌లో పొకో ఎఫ్ 5, పొకో ఎఫ్ 5 (Poco F5 Series)ప్రో మోడల్స్ విడుదలవుతున్నాయి. వీటిలో వెనుక 64 ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు అమర్చారు. ముందు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. పొకో ఎఫ్ 5లో 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. పొకో ఎఫ్5 ప్రోలో 6.67-అంగుళాల డబ్ల్యూక్యూహెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఐకూ జెడ్ 7 ప్రో
ఈ ఫోన్లో కర్వ్డ్ డిస్ప్లే ఇస్తున్నారు. ఆగస్టు 13న ఐకూ జెడ్ 7 ప్రో (IQoo Z7 Pro)విడుదలవుతోంది. స్నాప్‌డ్రాగన్ 782 జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కెమెరా, ధర వివరాలు తెలియాల్సివుంది.
వివో వీ29 సిరీస్
వివో వీ29 (Vivo V29), వీ29ఈ (Vivo V20 E) వేరియంట్లలో 6.67-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉపయోగించారు. ఆగస్టు మూడు లేదా నాలుగో వారంలో విడుదలకానుంది. వీ29 మోడల్లో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుక 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 13 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, రెండు 2 ఎంపీ కెమెరాలున్నాయి. ముందు 32 ఎంపీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ 60 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ వేరియంట్ రేటు రూ. 40 వేలలోపు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.