బాలీవుడ్ హీరోయిన్ కంగనారౌత్ (Kangana Raut) రణబీర్ కపూర్-అలియా భట్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. వారిదో నకిలీ వివాహం అని నిప్పులు చెరిగింది. కంగనా రనౌత్ ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా మాట్లాడేస్తుంది. తనకు నచ్చని విషయాలను ముఖం మీదే చెప్పేస్తుంది. ఇక తన గురించి నెగెటివ్ ప్రచారం చేస్తే చీల్చి చెండాడుతుంది.తను ఏ ప్రాజెక్ట్ చేసినా రణబీర్ (Ranbir) అందులో నెగిటివ్ టాక్ ను స్పెడ్ చేయడానికి ట్రై చేస్తాడు. అందుకే ఈ రోజు నుంచి రణబీర్ ను నాశనం చేయడమే నా పని అంటూ శపథం చేసింది కంగనా. సోషల్ మీడియా(Social media)లో వరుస పోస్టులు పెడుతూ ఫైర్ అయింది.
కంగనా రనౌత్, విజయ్ సేతుపతి(Vijay Sethupathi)తో చేయబోయే ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో ఓ వర్గం ట్రోలింగ్ చేసింది.. తన కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన నెగెటివ్ కవరేజ్ కు సంబంధించిన వార్తల స్క్రీన్ షాట్లను షేర్ చేసింది. ’’నేను ఎప్పుడు ఏ కొత్త మూవీ ప్రకటించినా, భయంకరమైన నెగెటివ్ ప్రచారం జరుగుతుందని కంగన తెలిపింది.ఇటీవల తన పుట్టిన రోజు వేడుకల కోసం రణబీర్ కపూర్ లండన్ కు వెళ్లాడు. ఆయనతో పాటు తన తల్లి నీతూ కపూర్ (Neetu Kapoor) తో ఇతర కుటుంబ సభ్యులు వెళ్లారు. అయితే, తన భార్య ఆలియా, కూతురు రాహా మాత్రం ఇండియాలోనే ఉండిపోయారు.
ఇక కంగనా ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న ‘తేజస్’ మూవీ (Tejas’ movie) అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. కంగనా తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ఎమర్జెన్సీ’ని విడుదలకు సిద్ధం చేస్తోంది. ఆమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కంగనా భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. నవంబర్ 24న ఈ సినిమా విడుదల కానుంది. అటు ‘చంద్రముఖి(Chandramukhi) 2’, నోటి బినోదిని బయోపిక్ కూడా చేస్తోంది.