In Uttar Pradesh, youths riot on top of a car under the influence of alcohol. 10 thousand fine if caught
Viral News: మద్యం మత్తులో కారుపై యువకులు రచ్చ చేశారు. వారి వల్ల మిగతా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఘజియాబాద్ (Ghaziabad)లో జరిగింది. ప్యాసెంజర్స్‌ను ఇబ్బందికి గురిచేసిన యువకులను శనివారం అరెస్టు(Arrest) చేశారు. కారు సీజ్(Seize the vehicle) చేసి, వారికి రూ. 10,000 జరిమానా(fine) విధించారు. కవి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని.. కొంత మంది యువకులు రన్నింగ్‌లో ఉన్న కారు టాప్‌పై కూర్చొని, ఫుల్‌గా మధ్యం తాగి ప్రయాణికులను, వాహన దారులను ఇబ్బందులకు గురిచేశారు. ఆ ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి కారును సీజ్ చేశాం. వారికి రూ. 10 వేలను జరిమానా విధించామని పేర్కొన్నారు.
నిందితులపై రెండు సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 3, 4 కింద వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశంలో స్పీడ్‌గా నడపడం, ప్రయాణికులను ఇబ్బంది గురిచేయడం వంటి చట్టవ్యతిరేక చర్యలు కింద కేసు పెట్టారు. మే నెలలో పోలీసు జీప్‌పై ఇన్స్టాగ్రామ్ రీల్ చేసినందుకు ఇద్దరు యువకులపై కాన్పూర్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో బరేలీలో 14 మంది మూడు బైక్‌లపై విన్యాసాలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను సీజ్ చేశారు.