E.G: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రాజమండ్రిలోని ఓ హోటల్లో ఆదివారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ ఉపవాసాలు భక్తిశ్రద్ధలతో చేసే ముస్లింలకు అల్లా ఆనందం, ఆరోగ్యం కల్పించాలని ప్రార్థించారు.