మెదక్లో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. గత పది రోజులుగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ వర్షం ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. అకాల వర్షమైనప్పటికీ ఎండ తీవ్రతకు ఎండిపోతున్న యాసంగి వరి పంటలకు ఇది ఎంతో మేలు చేకూరుస్తుందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు.