»Two Buses Collided Accident In Maharashtras Buldhana District Six People Dead 20 Injured
Accident: రెండు బస్సులు ఢీ..ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు
రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నాయి. ఆ క్రమంలో ఓ బస్సును మరొకటి ఓవర్ టేక్ చేసే సమయంలో రెండు ఒకదానికొకటి ఢీకొన్నాయి(accident). దీంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు.
మహారాష్ట్ర(Maharashtra)లోని బుల్దానా(Buldhana)లో నిన్న అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(accident) జరిగింది. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. మల్కాపూర్ ప్రాంతంలోని నందూర్ నాకా ఫ్లైఓవర్ వద్ద ఎన్‌హెచ్ 53లో తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. బాలాజీ ట్రావెల్స్ అనే ప్రైవేటు బస్సు ఒకటి అమర్నాథ్ యాత్రకు వెళ్లి హింగోలి జిల్లాకు తిరిగి వస్తుండగా, మరొకటి రాయల్ ట్రావెల్స్ కంపెనీకి చెందినది నాసిక్మ్కు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. నందూర్ నాకా వద్ద బస్సు ఒకటి ఓవర్టేక్ చేసే క్రమంలో రెండు ఢీకొన్నాయని పోలీసులు చెప్పారు. ఆ క్రమంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా, గాయపడ్డ మరో 20 మందిని బుల్దానాలోని ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో అమర్నాథ్ నుంచి తిరిగి వస్తున్న బస్సు డ్రైవర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం బస్సును రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే బుల్దానా జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన రెండో అతిపెద్ద బస్సు(bus) ప్రమాదం(accident) ఇది కావడం విశేషం. జూలై 1న ఇదే జిల్లాలో మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో ముగ్గురు పిల్లలతో సహా కనీసం 25 మంది సజీవదహనమయ్యారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.