Dharmapuri Arvind: బీజేపీ ఫైర్ బ్రాండ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై (Arvind) సొంత పార్టీ నేతలు అసమ్మతి రాగం వినిపించారు. 13 మండలాల అధ్యక్షులను మార్చడంపై భగ్గుమన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో గల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిరసన చేపట్టారు. అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తీసివేసిన మండల అధ్యక్షులను తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ కోసం పనిచేస్తోన్న వారికి అర్వింద్ (Arvind) అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేస్తానని నేతలు చెప్పారు. దీంతో నేతలు ఆందోళన విరమించారు. ఎన్నికల ముందు బీజేపీలో ఆందోళన ఆ పార్టీకి కాస్త మైనస్ అవనుంది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను మార్చడంతో.. చాలా మంది నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇప్పుడు అర్వింద్‌కు (Arvind) వ్యతిరేకంగా రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. మూడు, నాలుగు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలో బీజేపీలో ఈ అసమ్మతి ఆ పార్టీకి అంత మంచిది కాదు. కలుపుకొని.. పని చేయాల్సిన సమయంలో ఇలా.. బయటపడటంతో ప్రజల్లో చులకన అవుతారు. ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.
గందరగోళంగా రాష్ట్ర బీజేపీ పరిస్థితి.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వ్యతిరేకంగా నిజామాబాద్ బీజేపీ నేతల ఆందోళన.
నాంపల్లి పార్టీ కార్యాలయంలో ఆందోళనకు దిగిన నిజామాబాద్ బీజేపీ కార్యకర్తలు.
బండి సంజయ్ (bandi sanjay) మీద వ్యతిరేకత.. ఇతర అంశాల వల్ల పార్టీ అధ్యక్షుడి మార్పు జరిగింది. కానీ కేంద్రమంత్రి, ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి హవా మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఎన్నికల నాటికి బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలీ మరీ.