A Bhojpuri actress was raped for giving her a chance
Bhojpuri actress: ఆన్లైన్ సేవలు విస్తృతం అయిన తరువాత ఎవరు మంచి వారో ఎవరు ముంచేవారే తెలియడం లేదు. అందుకనే పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తుంటారు. అయిన సరే గుడ్డిగా నమ్మి మోసపోవడం తరువాత విచారించడం షరా మాములే. ఈ మేరకు ఓ భోజ్‌పూర్ నటి(Bhojpuri actress) ఓ అఘాంతకుడి చేతిలో అత్యాచారానికి గురి అయింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయిన తనపై అఘాయిత్యానకి పాల్పడ్డాడని నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అలస్యంగా ఈ ఘటన వెలగులోకి వచ్చింది. ఇదే విషయాన్ని ఎసీపీ వరుణ్ దహియా మీడియాకు తెలియజేశారు.
ఓ భోజ్‌పూరి నటి ఢిల్లీ(Delhi)లో నివస్తోంది. తనకు ఇన్స్టాగ్రామ్(Instagram)లో పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ఇక మహేష్ పాండే అనే వ్యక్తి తనతో అదే సోషల్ మీడియా వేదికగా స్నేహం చేశాడు. తనకు భోజ్‌పూరి పరిశ్రమలో మంచి పరిచయాలు ఉన్నట్లు, ఆమెకు చిత్రాలలో నటించే అవకాశం కల్పిస్తానని నమ్మించాడు. జూన్ 29న ఇంటర్వ్యూ కోసం ఉత్తరప్రదేశ్‌లోని గురుగ్రామ్‌లోని ఒక హోటల్‌కు పిలిచాడు. అనంతరం అమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని అతడు బెదిరించాడు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు వరుణ్ దహియా తెలిపారు. బాధితులరాలు స్టేట్ మెంట్ ప్రకారం…
నన్ను సుభాష్ వ్యక్తి హోటల్‌కు తీసుకెళ్లినప్పటికే నకిలీ ఐడీతో గదిని బుక్ చేశాడు. ఆ గదిలో మహేష్ పాండే ఉన్నాడు. ముందు కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత అతను తాగడం ప్రారంభించాడు. ఆ తర్వాత సుభాష్‌ను బయటకు పంపించాడు. నాపై అత్యాచారం చేశాడు. అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు గురుగ్రామ్ క్రైమ్ భ్రాంచ్ ఏసీసీ వరుణ్ దహియా చెప్పారు. నిందితుడు మహేష్ గురుగ్రామ్‌లోని చక్కర్‌పూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్టు తెలిపారు.
#WATCH | Haryana: A Bhojpuri actress has accused a person named Mahesh Pandey of rape. A case has been registered under the relevant sections. Mahesh Pandey called the actress to a hotel for an interview and when she came there, he raped her. Investigation underway: Varun Dahiya,… pic.twitter.com/4SLlQjyvmi