HDFC: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్.. రికార్డ్ స్థాయిలో నికర లాభం
ఇండియాలనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్‌గా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విస్తరించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో పెద్ద మొత్తంలో లాభాలను నమోదు చేసింది. అంతే కాకుండా బ్యాంకు 30 శాతం నికర లాభాన్ని ఆర్జించింది.
Country's Largest Private Bank.. Record Net Profit
HDFC: ఇండియాలనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్‌గా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విస్తరించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో పెద్ద మొత్తంలో లాభాలను నమోదు చేసింది. అంతే కాకుండా బ్యాంకు 30 శాతం నికర లాభాన్ని ఆర్జించింది. ఈ త్రైమాసికంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాభం రూ.11,952 కోట్లకు పెరిగింది. చివరి త్రైమాసికంలో రూ.9,196 కోట్లు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాభాల్లో రికార్డు పెరుగుదల మాత్రమే కాదు. హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలీనం తర్వాత ఇది ప్రపంచంలోని ఏడవ అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయంలో కూడా పెరుగుదల కనబరిచింది. ఈ కాలంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 21.1 శాతం పెరిగి రూ. 23,599 కోట్లు దాటింది.
HDFC బ్యాంక్ విలీనం తర్వాత ప్రపంచంలోనే ఏడవ అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించింది. కొత్త షేర్ల జాబితా తర్వాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ విలువ రూ.12.4 లక్షల కోట్లు దాటింది. జూలై 17న విలీనం తర్వాత, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్టాక్ మార్కెట్లో రూ.311 కోట్ల షేర్లు లిస్టయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇప్పుడు జెపి మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా వంటి దిగ్గజాలతో నేరుగా పోటీపడనుంది.