యువకులు ఫుడ్ ఛాలెంజ్ చేసే విషయంలో జాగ్రత్తగా వహించండి. ఎందుకంటే పరిమితికి మించి తినడం వల్ల అనార్థాలతోపాటు ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. అచ్చం ఇలాంటి ఘటనే ఇటివల బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో చోటుచేసుకుంది.
స్నేహితులు సరదాగా చేసిన బెట్టింగ్ ఫుడ్ ఛాలెంజ్ ఏకంగా ఓ యువకుడి ప్రాణం తీసింది. ఫుడ్ సవాల్ స్వీకరించిన యువకుడు పరిమితికి మించి తినేశాడు. కానీ ఊపిరి ఆడక మృత్యువాత చెందాడు. ఈ ఘటన ఇటివల బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో జరిగింది. బిపిన్‌కుమార్ పాశ్వాన్ (25) అనే యువకుడు మొబైల్ రిపేర్ షాపులో పనిచేసేవాడు. గురువారం యథావిధిగా తన దుకాణానికి వెళ్లిన అతను ఆరోజు సాయంత్రం తన స్నేహితులతో సమావేశమయ్యాడు. ఆ క్రమంలో ఎక్కువగా మోమోలు ఎవరు తింటారోనని వారికి వారు సవాలు చేసుకున్నారు. పాశ్వాన్ స్నేహితులు కూడా మోమోస్ తినమని(momos eating) ఛాలెంజ్ చేశారు. ఆ నేపథ్యంలో ఓ హోటల్ వెళ్లిన వారిలో పాశ్వాన్ పరిమితికి మించి 150 మోమోలు తిన్నాడు.
విపిన్ వారితో కలిసి మోమోస్ తిన్నాడు. ఆ తర్వాత స్నేహితులందరూ(friends) వెళ్లిపోయారు. కొంత సమయం తరువాత, అతను అనారోగ్యంతో బాధపడుతూ కింద పడిపోయాడు. అనంతరం కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుని తండ్రి తన స్నేహితులు తన కుమారుడి హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. బిపిన్ కుమార్ కు విషం ఇచ్చారని అంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాత అతని మృతికి గల కారణాలు తెలియనున్నాయి.