Heroine Ankitha: నవదీప్ తో గొడవ..? అందుకే ఇండస్ట్రీని వదిలేసిన సింహాద్రీ బ్యూటీ
హీరోయిన్ అంకిత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ``లాహిరి లాహిరి లాహిరిలో` సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది ఈ బ్యూటీ. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది.
Heroine Ankitha: హీరోయిన్ అంకిత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. “లాహిరి లాహిరి లాహిరిలో` సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది ఈ బ్యూటీ. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘సింహాద్రి’ సినిమాలో నటించి ఇండస్ట్రీలో హిట్ కొట్టింది. ఈ సినిమాతో అంకిత దశ తిరిగిందని అంతా అనుకున్నారు.
కానీ, అలా జరగలేదు. అంకిత ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలవలేకపోయింది. 2009 నుంచి వెండితెరపై కనిపించని అంకిత 2016లో విశాల్ జగ్తాప్ను పెళ్లి చేసుకుని అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంకిత.. అసలు విషయాన్ని బయటపెట్టింది. సినిమాల నుంచి తప్పుకోవడానికి గల కారణాలను కూడా వివరించింది. బాలకృష్ణ నటించిన “విజయేంద్ర వర్మ` సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న సంగతిని అంకిత గుర్తు చేసుకుంది. ఆ సినిమా తర్వాత పెద్ద ఆఫర్లు వస్తాయని భావించి ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయితేనే తన కెరీర్ బాగుంటుందని.. విజయేంద్ర వర్మ హిట్ అయ్యి ఉంటే ఇండస్ట్రీలో ఉండేవాడినని, అయితే అలా జరగలేదని.. అందుకే సినిమాల నుంచి తప్పుకున్నానని అంకిత తెలిపింది. ఆ సమయంలో నవదీప్తో అంకిత గొడవపడిందని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఆమె కూడా స్పందించారు. తనకు, నవదీప్కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. ఉదయ్ కిరణ్ మరియు ఆర్తి అగర్వాల్ పరిశ్రమలో తనకు మంచి స్నేహితులని, అయితే వారిద్దరూ ఇప్పుడు లేరని అంకిత అన్నారు.