»Do Aghoras Really Have Powers Is Their Life That Hard
Aghora: అఘోరాలకు నిజంగా శక్తులుంటాయా? వారి జీవనం అంత కఠినంగా ఉంటుందా?
అఘోరాలు పరమ శివుని భక్తులు. వీరికి ఉన్న ప్రత్యేకత వేరు. అయితే కొందరు వ్యసనాలకు అలవాటు పడి, గంజాయి తాగుతూ, స్త్రీలతో అసభ్యంగా ఉంటూ అఘోరాలని చెప్పుకుంటూ ఉంటారు. వారు నిజంగానే అఘోరాలేనా అని అందరికీ సందేహం కలుగుతుంది. నిజమైన అఘోరాలెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
భక్తిభావంలో శివతత్వానికి ఉన్న ప్రత్యేకత వేరు. పరమశివునికి(Lord Shiva) అపర భక్తులు ఉంటారు. అందులో కొందరు కఠిన నియమాలతో పూజలు చేస్తుంటారు. పురాతన దేవాలయాలు, పెద్ద పెద్ద ఆలయాల వద్ద నాగ సాధువులు, అఘోరాల(Aghoras)ను చాలా మంది చూస్తూనే ఉంటారు. అయితే ఆ అఘోరాల గురించి చాలా మందికి పూర్తిగా తెలీదు. అఘోరా అంట శాంతికి ప్రతి స్వరూపం అని, ఘోరానికి పర్యాయపదం అని గ్రహించాలి. కొంత మంది అఘోరాలు గంజాయి తాగుతూ ఉంటారు. వారంతా నిజమైన శివ భక్తులేనా అనే ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది.
అయితే వ్యసనాలకు అలవాటుపడిన వారికి మహాశివుడు దూరంగా ఉంటాడని, స్వచ్ఛమైన అఘోరాలకు ఏ దురలవాట్లు ఉండవని పండితులు చెబుతుంటారు. అఘోరతత్వం అంటేనే పరమ వైతితం, శాంతం, శివ చైతన్య స్వరూపం అని యోగులు తెలియజేస్తారు. అసలైన అఘోరాలు(Aghoras) ప్రవహించే గంగా నదిని సైతం ఆపేస్తారని ఆదిత్య పరశ్రీ స్వామీజీ వివరించారు. అఘోరతత్వంతో పారిపోతున్న పామును సైతం అక్కడికక్కడే ఆపేయొచ్చు.
మద్యం, స్త్రీలపై వ్యామోహం ఉండేవారు అఘోరాలు కారని ఆదిత్య పరశ్రీ స్వామి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. నిజమైన అఘోరాలు(Aghoras) కేవలం శివనామస్మరణనే చేస్తుంటారని, సాధారణ మనుషుల లాగే జీవిస్తారని, వారి జీవిత కాలం కూడా 60 నుంచి 100 ఏళ్లకు పైనే ఉంటుందని ఆ స్వామీజీ తెలిపారు. శివనామ స్మరణ చేసే అఘోరాలు మద్యం, మాంసం జోలికి అస్సలు వెళ్లరని శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరశ్రీ స్వామీజీ వివరించారు.