Ananya Pandey: మరోసారి ప్రేమలో పడిన లైగర్ బ్యూటీ..!
లైగర్ బ్యూటీ అనన్య పాండే గతంలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో ప్రేమలో ఉంది అంటూ ఎంతో కాలంగా వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను వారు ఏ రోజూ కన్ఫామ్ చేయలేదు. అయితే, తాజాగా ఆమె మరో హీరోతో ప్రేమలో పడింది అంటూ వార్తలు వచ్చాయి. అందుకు సాక్ష్యంగా వారి ఫోటోలు కూడా బయటకు రావడం విశేషం.
స్పెయిన్‌లో విహారయాత్ర సందర్భంగా ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్‌తో అనన్య పాండే(Ananya Pandey) తీసుకున్న ఫోటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. నివేదికల ప్రకారం, అనన్య , ఆదిత్య విడివిడిగా ఒక రాక్ కచేరీకి హాజరయ్యేందుకు స్పెయిన్ కి వెళ్లారు. ఇద్దరూ స్పెయిన్ సందర్శన గురించి తమ తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో విడివిడిగా పంచుకున్నారు.
తాజాగా పోర్చుగల్ రాజధాని లిస్బన్లో వీరిద్దరూ కలిసి కనిపించారు. ఒక చిత్రంలో ఆదిత్య రాయ్ , అనన్య పాండేAnanya Pandey ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకొని ఉన్న ఫోటోలు బయటకు రావడం విశేషం. వీరిద్దరి అభిమానులు ఈ ఫొటోలను చూసి వాటిని క్లిక్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆదిత్య డీప్ బ్లూ రౌండ్-నెక్ షర్ట్, హాఫ్ ప్యాంట్ ధరించాడు. అనన్య బ్లూ కలర్ డ్రెస్ లో కనిపించింది. ఆ సమయంలో ఆమె ఎలాంటి మేకప్ వేసుకోకుండా ఉండటం విశేషం.
కాగా, ఆదిత్య, అనన్య పాండే(Ananya Pandey) ఒకరినొకరు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ జంట ఇప్పుడు బాలీవుడ్ లో వైరల్ గా మారగా వీరిద్దరికి దాదాపు 13 ఏళ్ల వయసు తేడా ఉంది అంటూ కూడా కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ఇప్పుడు బాలీవుడ్ లో ఈ జంట హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు.