తిరుమల(Tirumala) శ్రీవారి భక్తులు అలర్ట్. నేడు తిరుమలలో బ్రేక్ దర్శనాలు(Break Darshans) రద్దయ్యాయి. జులై 17వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని నేడు కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ(TTD) తెలిపింది. దీంతో మంగళవారం బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupathi Devasthanams) వెల్లడించింది.
తిరుమల(Tirumala)లో గత వారం రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. మొత్తం 20 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. టోకెన్ లేని భక్తుల(devotees)కు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. సోమవారం 64,347 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 28,358 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.11 కోట్లు నమోదైంది.