Free cancer screening tests for film workers at Chiranjeevi Charitable Trust on Sunday
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ(Telugu Film Industry) 24 క్రాఫ్ట్స్ కార్మిక సంఘాల నాయకులకు, కమిటీ సభ్యులకు, యూనియన్ సభ్యుల కోసం ఇటీవల చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, స్టార్ క్యాన్సర్ సెంటర్ సంయుక్త కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సినీ కార్మికులు(Film workers), సినీ పాత్రికేయుల(Film journalists)కు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్(Free cancer screening) పరీక్షలు నిర్వహించనున్నారు. ఎల్లప్పుడు సినీకార్మికులకు అండగా ఉండే మెగాస్టార్ చిరంజీవి తన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టార్ హాస్పిటల్ సిబ్బంది సమక్షంలో క్యాన్సర్ వ్యాధికి గురికాకుండా ముందస్తుగానే గుర్తించేందుకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ క్రమంలో జులై 9 ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ హెల్త్ క్యాంపు ప్రారంభం కానుంది. హైదరాబాద్ లో తొలి క్యాంపును నిర్వహించనున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, స్టార్ హాస్పిటల్స్ సౌజన్యంతో హైదరాబాదులోని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ వద్ద ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.