T20 WCలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ, ఇప్పుడు IPLలో సందడి చేయనున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్థానాన్ని ముజరబానీతో భర్తీ చేసింది. ఈ విషయాన్ని KKR యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. గతేడాది RCB జట్టులో ఉన్నప్పటికీ ముజరబానీకి తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు.