సముద్రపు చేపల రుచులో రారాజుగా పిలిచే భారీ పండగప్ప చేప యానం (Yanam) గోదావరిలో మత్యకారుల వలకు చిక్కింది.15 కేజీల పండుగప్ప చేప (Pandugappa fish)ను స్థానిక మార్కెట్ వేలం పాటలో మత్యకార దంపతులు పోనమండ భద్రం,రత్నంలు 9 వేల రూపాయలకు దక్కించుకున్నారు. గోదావరి(Godavari)లో ఇంత భారీ పండుగప్ప చేప దొరకడం చాలా అరుదుగా జరుగుతుందని మత్యకారులు అన్నారు. గోదావరిలో దొరికే పండుగప్ప చేప మంచి రుచిగా ఉండటంతో మాంస ప్రియులు దీనిని కొనడానికి పోటీ పడ్డారు.
గతంలో గోదావరిలో 20 కేజీల పండుగప్ప దొరకగా ప్రస్తుతం దొరికిన పండుగప్ప చేప 15 కేజీల బరువు ఉందని మత్స్యకారులు (Fishermen) చెప్పారు. ఉప్పు నీటితో పాటు మంచి నీటిలో పెరగడం పండుగప్ప ప్రత్యేకత. ఈ చేప మాంసాహార జీవి అని, మన శరీరానికి కావాల్సిన ప్రొటీన్ల (proteins) లో చాలావరకు ఈ చేపలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ చేపను తింటే శరీరానికి కవాల్సిన చాలా ప్రొటీన్లు అందుతాయట. పులుపు, ఫ్రై చేయడంతో పాటు ఉప్పు చేప(salt fish)గా కూడా దీన్ని తింటారు. ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు ఇంట్రస్ట్ చూపించారు