»Vande Bharat Ticket Checker Cheats Death In Dramatic Fall Video Goes Viral
Viral Video: చావు నుంచి తృటిలో తప్పించుకున్న వందేభారత్ టీసీ
స్టేషన్ నుంచి రైలు స్టేషన్ నుంచి బయలుదేరింది. టీసీ ట్రైన్ మిస్ అయ్యాడు. అప్పుడు అతను పరిగెత్తుతూ వందే భారత్ రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు కానీ అతని బ్యాలెన్స్ కోల్పోతాడు.
Viral Video: చాలా మంది చాలా పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంటారు. వాళ్లనే అందుకే అంటారు వీడికి భూమ్మీద నూకలున్నాయని అలాంటి ఘటనే అహ్మదాబాద్‌లో జరిగింది. రైల్వే స్టేషన్లో వందేభారత్ రైలు టికెట్ చెకర్
(టీసీ) పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. రైలు అహ్మదాబాద్ స్టేషన్‌కు చేరుకోగానే గేటు మూసి ఉంది. రైలు పట్టుకునే తొందరలో టీసీ దూకి కిందపడిపోయాడు. కదులుతున్న రైలు ఎక్కేందుకు అతడు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో రైలు కింద పడి ప్రాణాలతో బయటపడ్డాడు. అక్కడ ఉన్నవారు పరిగెత్తుకుంటూ వచ్చి అతడి ప్రాణాలను కాపాడారు. టీసీ మళ్లీ లేచి వెంటనే పరుగు ప్రారంభించాడు.
Video | Gates of Mumbai bound Vande Bharat closed at Ahmedabad station & a Ticket checker was left out. Desparate to get in, he attempted something that may have cost him his life. This is reported to have happened on 26th June. #Vandebharat#Mumbai#IndianRailpic.twitter.com/WvzuQDGudN
వాస్తవానికి అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ వెలుపల రైలు గేటు అకస్మాత్తుగా మూసుకుపోయింది. టీసీ రైలు బయల్దేరడం చూసి తొందరపడి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ని పరుగెత్తుకుని అందుకుందామని అనుకున్నాడు. అప్పుడే ప్రమాదం జరిగింది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన అతడు కిందపడిపోవడంతో రైలు కిందకు రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఈ ప్రమాదం ఎవరికైనా రావచ్చని ప్రజలు అంటున్నారు. వందే భారత్ తన ఉద్యోగులకు బోర్డింగ్, నిష్క్రమణకు సంబంధించి హెచ్చరికలను పంపుతుందని అనేక నివేదికలలో పేర్కొన్నారు. టికెట్ చెకర్ పొరపాటున అంతర్గత హెచ్చరికను వినలేదు. డ్రైవర్ కూడా టీసీని చూడలేదు. గేటు తెరవకపోవడంతో టీసీ పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు.