»Want To Fly Above The Traffic Worlds 1st Flying Car Certified By Us
Flying Car: ట్రాఫిక్‌తో చిరాకుపడుతున్నారా? ఎగిరే కారు రెడీ
ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే కారు అందుబాటులోకి రానుంది. ఈ ఫ్లైయింగ్ కారుకు అమెరికా సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి.
ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే కారు(Flying Car) సిద్ధమైంది. ‘అలెఫ్ మోడల్ A’ (Alef Model A) కారుకు అమెరికా సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కారు విమానం తిరిగేందుకు ప్రత్యేకంగా అనుమతినిచ్చింది. దీంతో ప్రపంచంలోనే అనుమతి పొందిన మొట్టమొదటి ఎగిరే కారు ఇదే కావడం విశేషం. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ‘అలెఫ్ ఏరోనాటిక్స్’ కంపెనీ(Alef Aeronautics Company) ఈ ఫ్లైయింగ్ కారును రెడీ చేసింది. ఈ కారు బుకింగ్‌లు(Bookings) కూడా 2022 అక్టోబర్ నుంచే ప్రారంభమయ్యాయి.
గాలిలో ఎగిరే ఈ కారు(Flying Car) ఎలక్ట్రిక్‌ది కావడం విశేషం. దీనికి యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(FAA) నుంచి ప్రత్యేక వర్ధినెస్ సర్టిఫికేషన్ కూడా లభించింది. ఈ విషయాన్ని అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ(Alef Aeronautics Company) వెల్లడించింది. ఈ కారు రోడ్డుపై నడవడంతో పాటుగా ఆకాశంలోనూ ఎగురుతుంది. ఈ ఫోర్ వీలర్ కారు బాడీని కార్బన్ ఫైబర్ మెటీరియల్‌తో రూపొందించారు. దీనికి రెక్కలను అమర్చారు. గల్ వింగ్ డోర్లు, కవర్ వీల్ వెల్స్, స్టైలిష్ రిమ్స్ వంటి ఫీచర్లు ఈ కారు సొంతం.
‘అలెఫ్ మోడల్A’ కారు(Alef Model A Car)లోని ఫ్లయింగ్ మోడల్ బటన్‌ను నొక్కగానే కాక్‌పిట్‌లోని సీట్లు 90 డిగ్రీల కోణంలో కదులుతాయి. కారుకున్న రెండు రెక్కలు కూడా బైప్లైన్ లాగా మారిపోతాయి. ఎగిరే కారు ఆ విధంగా ముందుకు, వెనుకకు, పక్క వైపులకు తన దిశను మార్చుకుంటూ వెళ్తుంది. డ్రైవన్ సూచనల ప్రకారంగానే కారు నడుస్తుంది. ఈ కారులో డిటెక్షన్ సిస్టమ్, పారాచూట్ వంటివి ఉన్నాయి.
ఒక్కసారి ఈ కారుకు ఛార్జింగ్(Charging) చేస్తే 321.8 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ కారు హైడ్రోజన్ ఇంజన్ వెర్షన్లోనూ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎగిరే కారు(Flying Car) ధర సుమారు రూ.2.46 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కార్ల ఉత్పత్తి 2025 చివరి నాటికి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కారును ప్రముఖ డిజైనర్ హిరాష్ రాజాగీ (Designer Hiraash Raajagi) డిజైన్ చేశారు. ఈయన గతంలో బుగాటీ, జాగ్వార్ కార్ల మోడల్స్‌ను డిజైన్ చేసిన సంగతి తెలిసిందే.