»India Pakistan Odi Match On October 15th 2023 One Day Hotel Room Rs One Lakh Ahmedabad
India Pakistan match: ఒక్క రోజు హోటల్ రూం ధర లక్ష!
ICC మంగళవారం ODI ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌లను ప్రకటించిన తర్వాత అహ్మదాబాద్‌లో పరిస్థితులు మారాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 15న ఉన్న క్రమంలో అక్కడి హోటల్ రూమ్ ధరలు ఒక్కసారిగా 10 రెట్లు పెరిగాయని చెబుతున్నారు. అయితే ఈ మ్యాచ్ కోసం ముందుగానే బుకింగ్స్ మొదలైనట్లు తెలుస్తోంది.
వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ ఇప్పటికే వచ్చేసింది. ఈ నేపథ్యంలో చాలా మంది అభిమానులు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్(India Pakistan match) కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే మరికొంత మంది మాత్రం ఈ మ్యాచును లైవ్ లో చూడాలని అనుకుంటారు. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లో ఈ గేమ్ జరగనున్న క్రమంలో ముందుగానే హోటళ్లను బుక్ చేసుకుంటున్నట్లు తెలిసింది. అయితే ఈ ఒక్కరోజు హోటళ్లలో ఉండాలంటే రోజుకి లక్ష రూపాయల వరకు అద్దె అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు అనేక స్టార్ హోటళ్లలో గదులు కూడా ఇప్పటికే బుక్ అయినట్లు తెలిసింది.
అక్టోబర్ 15న అహ్మదాబాద్(ahmedabad) స్టేడియంలో పాకిస్థాన్‌తో భారత్ మూడో మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే అభిమానుల్లో ఈ మ్యాచ్ కు క్రేజ్ మొదలై అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలుపెట్టేశారు. అక్టోబరు 15న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కారణంగా హోటళ్ల ధరలు దాదాపు పది రెట్లు పెరిగాయని అక్కడి ప్రజలు అంటున్నారు. గతంలో సాధారణంగా విలాసవంతమైన హోటల్ గది అద్దె రోజుకు రూ.5000 నుంచి 8000 వరకు ఉండేది. ఇది అక్టోబర్ 15 నాటికి ఈ అద్దె కొన్ని చోట్ల 40000 నుంచి లక్షకు చేరుకుందని చెబుతున్నారు.
కొన్ని వెబ్ సైట్ల డేటా ప్రకారం జూలై 2న అహ్మదాబాద్‌లో డీలక్స్(deluxe room) రూమ్ ధర రూ.5,699 కాగా, అక్టోబర్ 15న ఒకరోజు బస చేయాలనుకుంటే అదే హోటల్ రూ.71,999 వసూలు చేస్తుంది. చాలా హోటళ్లలో అక్టోబర్‌లో మ్యాచ్ రోజులలో రోజుకు గది ధర రూ.90,679 వరకు ఉంది. స్టేడియానికి దూరంగా ఉన్న హోటళ్లకు ఒకరోజు అద్దె రూ.25,000 నుంచి రూ.50,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15న జరిగే మ్యాచ్ కారణంగా అహ్మదాబాద్‌లోని చాలా ఫైవ్ స్టార్ హోటళ్లు పూర్తిగా బుక్ చేయబడ్డాయని పలువురు పేర్కొన్నారు.