MS Dhoni: విమానంలో క్యాండీ క్రష్ ఆడుతున్న ధోనీ.. ఎయిర్హోస్టెస్ ఏం చేసిందంటే?
ఇండిగో ఫ్లైట్ లో ధోని ప్రయాణించాడు. సీట్లో తన ట్యాబ్ లో గేమ్ ఆడుతూ కనిపించాడు. ఇది క్షణాల్లో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇదే సమయంలో ధోనీ ఆడిన క్యాండీ క్రష్ గేమ్ డౌన్ లోడ్లు లక్షల్లో పెరిగాయి. దీంతో ధోనీ క్రేజ్ అది అంటూ ఆయన అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.
MS Dhoni: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ MS ధోని అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. క్రికెట్ చరిత్రలో ఆయనో ట్రెండ్ సెట్టర్. కెరీర్ మొదట్లో ధోనీ హెయిర్ స్టైల్ చూసి చాలా మంది అనుకరించేవారు. ఈ జార్ఖండ్ డైనమెట్ కెప్టెన్ గా ఇండియన్ క్రికెట్ జట్టుకు ఎన్నో సంచలన విజయాలు అందించాడు. గతంలో ఎంతో మంది సీనియర్ కెప్టెన్లను ఊరించిన ఘనతలను ధోనీ తన నాయకత్వంలో సాధించి నిరూపించాడు. వాటిలో 2007 టీ20 వరల్డ్ కప్ , 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలు ఉన్నాయి. టెస్టుల్లో కూడా టీమిండియాను మొదటి స్థానానికి చేర్చాడు. ప్రస్తుతం టీమిండియా టీం లో లేకున్నా ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే మొన్నటి ఐపీఎల్.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐదోసారి ఈ కప్పును అందించి వార్తల్లో నిలిచాడు. ఇదో రికార్డు. ధోనీకి తప్ప మరెవరికీ సాధ్యం కాదని ఆయన అభిమానులు గట్టిగా చెబుతుంటారు. అయితే ధోనీ ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. మొన్నటికి మొన్న భగవద్గీత పుస్తకంతో కనిపిస్తే సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయింది. తాజాగా ఆయనకు చెందిన మరో వీడియో వైరల్ అవుతోంది. తాజా వీడియోలో
ఇండిగో ఫ్లైట్ లో ధోని ప్రయాణించాడు. సీట్లో తన ట్యాబ్ లో గేమ్ ఆడుతూ కనిపించాడు. ఇది క్షణాల్లో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇదే సమయంలో ధోనీ ఆడిన క్యాండీ క్రష్ గేమ్ డౌన్ లోడ్లు లక్షల్లో పెరిగాయి. దీంతో ధోనీ క్రేజ్ అది అంటూ ఆయన అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.
The way he winks his eyes 🥺
Also the way she is acting kittenish while having is wife right next to him 🥰
అయితే ఈ వీడియోలో ఫ్లైట్లో కూర్చొని ట్యాబ్లో గేమ్ ఆడుతున్నాడు. అంతలోనే ఫ్లైట్ సిబ్బంది వచ్చి ధోనీకి చాక్లెట్స్ ఆఫర్ చేస్తోంది. ధోనీ కూడా నవ్వుతూ ఆ చాక్లెట్స్ తీసుకుంటాడు. ఇక ధోనీ క్యాండీ క్యాండీ క్రష్ గేమ్ ఆడడంపై ఆ ఆట మేనేజ్ మెంట్ థ్యాంక్స్ చెప్పింది. ధోనీ వీడియో చూసిన తర్వాత 3 గంటల్లోనే 30 లక్షల మందికిపైగా క్యాండీ క్రష్ గేమ్ డౌన్ లోడ్ చేసుకున్నారని ప్రకటనలో వెల్లడించింది. ధోనీనా.. మజాకా మరి