KMM: సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కే.వెంకటేశ్వర్లు, డాక్టర్ విజయలక్ష్మి దంపతుల సంతానం గ్రీష్మ, ఆకాష్ వైద్య విద్యలో ప్రతిభ చాటారు. ఇటీవల పీజీ ఫలితాల్లో గ్రీష్మ ఎండీ (డెర్మటాలజీ), ఆకాష్ ఎండీ (ఎమర్జెన్సీ మెడిసిన్) విభాగాల్లో ఉచిత సీట్లు సాధించారు. ఒకే ఇంట్లో ఇద్దరు వైద్యులు ఉన్నత విద్యకు ఎంపికవ్వడంపై పలువురు వారిని అభినందించారు.

