పాలమూరులోని పంచముఖి కాలనీ 22వ డివిజన్లో సమస్యలు పరిష్కరించాలని కాలనీ వాసులు ఎంపీ డీకే అరుణను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాలనీలోకి వచ్చిన ఆమెకు వారు వినతిపత్రం అందించారు. వినతిపత్రంలో సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్, పార్కుల ఏర్పాటు చేయాలని కోరారు. ఎంపీ స్పందిస్తూ కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

