SRCL: శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉప ప్రధానార్చకులుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురికి అసిస్టెంట్ కమిషనర్ టైమ్ స్కేల్ మంజూరైంది. పారువెల్లి భాను, కేశన్నగారి శ్రీకాంత్, చంద్రగిరి శరత్, నమిలికొండ రాజేశ్వర శర్మ, కటుకూరి వెంకటయ్యలకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆలయ ఈవో రమాదేవి ఉత్తర్వులు జారీ చేశారు.