PPM: వేసవి కాలంలో ఆరోగ్య జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ఎన్సీడీ & ఆర్బీఎస్కే పీవో డా. టి. జగన్ మోహనరావు సూచించారు. అడ్డూరివలస ఆరోగ్య కేంద్రం, రావికోన ఆశ్రమ పాఠశాలను సందర్శించి మందుల లభ్యత, విద్యార్థుల ఆరోగ్య వివరాలను పరిశీలించారు. దీర్ఘకాలిక రోగులు, విద్యార్థుల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు.