తూ.గో జిల్లా బీజేపీ యువ మోర్చా అధ్యక్షులుగా రాజమండ్రి సిటీకి చెందిన పెరుమాళ్ళ పవన్ కుమార్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర నియమించారు. ఈ సందర్భంగా గురువారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. జాతీయ భావజాలంతో నడిచే బీజేపీలో యువత కీలక పాత్ర వహించాలని, బలమైన భారత్‌ను నిర్మించాలనే సంకల్పంతో యువత దేశ ప్రయోజనాల కోసం పని చేయాలన్నారు.