Basheer Master: రాకేష్ మాస్టర్ చావుకు మందు మాత్రమే కాదని అంటున్నారు కొరియోగ్రాఫర్ బషీర్. ఆయనతో హిట్ టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ చేసింది. మాస్టర్‌తో తనకు 18 ఏళ్ల అనుబంధం ఉందని వివరించారు. చిరునవ్వుతో మూవీ నుంచి పరిచయం ఉందన్నారు. అప్పుడు ఆయన మంచి రేంజ్లో ఉండేవారని.. ఫిల్మ్ నగర్లో మహేశ్ బాబు ఇంటి పక్కన గల గెస్ట్ హౌస్‌లో నెలకు రూ.44 వేలు కిరాయి ఇచ్చి ఉండేవారని గుర్తుచేశారు. 2003-04లో బాగుండేవారని.. ఎప్పుడైతే యూట్యూబ్‌లోకి వచ్చారో.. అప్పుడే వ్యసనాలకు అలవాటు పడ్డారని వివరించారు.
తనది ఖమ్మం జిల్లా అని బషీర్ మాస్టర్ చెప్పారు. తమ జిల్లాకు చెందిన వందేమాతరం శ్రీనివాస్‌ని కలిసానని.. డ్యాన్స్ కార్డ్ కోసం అలా రాకేష్ మాస్టర్‌తో పరిచయం ఏర్పడిందన్నారు. ఈటీవీలో భలే బాస్ చేశామని.. 2011లో ఢీ-2లో తాపే కంటెస్టెంట్ అని రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అని వివరించారు. ఢీ-2 చేసే సమయంలో మాస్టర్ ఇంట్లో 5,6 రోజులు ఉండేవారమని తెలిపారు. మాస్టర్ ఎలా ఉండాలి, ఎలా బతకాలో నేర్పిస్తారు. సినిమాల్లో ఉన్నప్పుడు బాగున్నారని.. అక్కడ మిస్ బిహేవ్, పవన్ కల్యాణ్‌ను తిట్టడంతో కార్డ్ రద్దు అయ్యిందని.. దీంతో సినిమాలు చేసే అవకాశం లేదని వివరించారు. యూట్యూబ్ షో, వీడియోలు చేసే సమయంలోనే మందు అలవాటు అయ్యిందని వివరించారు.
ముక్కురాజు, సోమరాజు, రాకేష్ మాస్టర్ సమకాలీకులు అని తెలిపారు. కృష్ణ నగర్లో రాకేష్ మాస్టర్‌కు ఓ డాన్స్ స్కూల్ ఉండేదని.. అక్కడికి శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ వచ్చేవారని తెలిపారు. సినిమాలు బ్యాన్ అయ్యాక ఎస్ఆర్కే యూట్యూబ్ చానెల్ పెట్టారని బషీర్ మాస్టర్ తెలిపారు. కరోనా సమయంలో బియ్యం, ఇతర వస్తువులు ఇచ్చి మంచి ఫేమ్ అయ్యారని తెలిపారు. ఆరేళ్ల క్రితం మాస్టర్‌కు అపెండిక్స్ ఆపరేషన్ జరిగిందని చెప్పారు. విజయనగరంలో మాన్సన్ హౌస్ మై హౌస్ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. అక్కడ డ్రింక్ చేయడం.. ఎండలో స్విమ్మింగ్ ఫూల్లో ఉండటం, మామిడి కాయలు తినడం, మందు ఎక్కువ తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతిందని తెలిపారు. మాస్టర్‌కి షుగర్, బీపీ ఉందని.. వెంటనే పల్స్ డౌన్ అయ్యిందని తెలిపారు. కడుపునొప్పి వచ్చి.. ఆరోగ్యం విషమించిందని పేర్కొన్నారు.