»Have You Seen Tharun Bhascker First Look In Keedaa Cola
Keedaa Cola:లో తరుణ్ భాస్కర్ లుక్ చూశారా?
పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్‌గా అరంగేట్రం చేసిన తరుణ్..ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ రెండు చిత్రాలతో డైరెక్టర్‌గా తరుణ్ భాస్కర్‌కు మంచి పేరు వచ్చింది. మంచి అభిరుచి, విభిన్నమైన ఫిల్మ్ మేకర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే రెండు సినిమాలు డైరెక్షన్ తర్వాత యాక్టర్‌గా, డైలాగ్ రైటర్‌గా బిజీ అయ్యాడు తరుణ్. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ..‘కీడా కోలా’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు తరుణ్ భాస్కర్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది.
కీడా కోలా(Keedaa Cola) మూవీ నుంచి తరుణ్ భాస్కర్(Tharun Bhascker) నాయుడు అంటూ తన పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఆయన మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. చేతిలో తుపాకీ, నోట్లో బీడీ, గడ్డంతో కనిపించి ఆకట్టుకుంటున్నారు. ఇటీవల బ్రహ్మానందం పోస్టర్ రిలీజ్ చేసి ఇంట్రస్ట్ క్రియేట్ చేయగా, ఇప్పుడు తరుణ్ భాస్కర్ పాత్రతో మరింత క్యూరియాసిటీ పెంచారు. కీడా కోలా సినిమా టీజర్‌ను జూన్ 29న విడుదల చేయనున్నట్టు తరుణ్ భాస్కర్ వెల్లడించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ నగరానికి ఏమైంది సినిమా రిలీజై జూన్ 29వ తేదీకి ఐదేళ్లు కానుంది. ఈ సందర్భంగా ఆ చిత్రం థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. కాగా, అదే రోజున కీడా కోలా మూవీ టీజర్‌ను విడుదల చేయననున్నట్టు తరుణ్ భాస్కర్ వెల్లడించాడు.
కీడా కోలా మూవీలో కామెడీ కింగ్, సీనియర్ యాక్టర్ బ్రహ్మానందం(brahmanandam) ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో బ్రహ్మీ ఫస్ట్ లుక్‌ను కూడా రివీల్ చేసింది చిత్రయూనిట్. క్రైమ్ కామెడీ సినిమాగా ఇంట్రెస్టింగ్ జానర్లో ఈ మూవీ రూపొందుతోంది. హీరోహీరోయిన్ అని కాకుండా మొత్తంగా 8 ప్రధాన పాత్రలు ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది. శ్రీపాద్ నందిరాజ్, భరత్ కుమార్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస కౌశిక్, సాయికృష్ణ, విజయ్ కుమార్ నిర్మిస్తున్న కీడా కోలా చిత్రం వీజీ సైన్మా బ్యానర్‌పై రానుంది. ఈ ఏడాదిలోనే కీడా కోలా విడుదవుతుందని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పేర్కొన్నారు.