»Actress Jagadeeswari Exclusive Interview Hit Tv Entertainment
Actress Jagadeeswari: 100కుపైగా సినిమాల్లో నటించింది..కానీ ప్రస్తుత పరిస్థితి దారుణం!
నటి జగదీశ్వరి(Actress Jagadeeswari)..ఈ పేరు ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. కానీ ఆమె ముఖం చూస్తే మాత్రం పలువురు గుర్తుపడతారు. ఎందుకంటే గతంలో అనేక కామెడీ చిత్రాలతోపాటు అనేక నాటకాలు, సీరియల్స్ లలో నటించారు. కానీ ఇప్పుడు మాత్రం అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో ఆమెతో మాట్లాడిన హీట్ టీవీ ప్రత్యేక ఇంటర్వూను ఇప్పుడు చుద్దాం.
టాలీవుడ్ నటి జగదీశ్వరి(Actress Jagadeeswari)..రెండు సార్లు నంది అవార్డును గెల్చుకుంది. అంతేకాదు మూడు వేలకుపైగా నాటకాలు వేయగా..వెయ్యికి పైగా అవార్డులు దక్కించుకుంది. 110కిపైగా సినిమాలు, 76 సీరియల్స్ లలో పలు క్యారెక్టర్లు చేసింది. కానీ ఈ నటి ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మాత్రం ఆధ్వానంగా తయారైంది. అవకాశాలు లేక అవస్థలు పడుతుంది. గతంలో శ్రీనగర్ కాలనీలో ఉండగా…పరిస్థితులు బాలేక ప్రస్తుతం ఇల్లు మారినట్లు హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
అయితే ఈమె 14 ఏళ్ల వయసు నుంచే నాటకరంగంలోకి వచ్చి అనేక పాత్రల్లో నటిస్తున్నట్లు వెల్లడించింది. ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా ఆ పాత్రకు న్యాయం చేసేది. ఆ రోజుల్లో తన తల్లిదండ్రులు నటకాల్లోకి రావడం మొదట ఒప్పుకోలేదని ఆమె పేర్కొన్నారు. ఆ క్రమంలో తాను రెండు రోజులు అన్నం తినకుండా నాటకం చేస్తానని చెప్పడంతో తన తల్లిదండ్రులు ఒప్పుకున్నట్లు వెల్లడించారు. తర్వాత నెల్లూరులో రాములమ్మ పాత్రలో మొదట నాటకం వేయగా.. ఆ క్యారెక్టర్ చాలా న్యాచురల్ గా వచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆ నాటకంలో తనకు ఉత్తమ నటిగా అవార్డు రావడంతోపాటు అప్పుడు ప్రభ, మోహన్ బాబు గారు కనిపించారని పేర్కొన్నారు. ఫుల్ ఇంటర్వూ కోసం ఈ వీడియో చూసేయండి మరి.