TPT: నాయుడుపేటలో ఈనెల 17న CM చంద్రబాబు టిడ్కో ఇళ్ల సముదాయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస కళ్యాణ మండపంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నాయకులు, కార్యకర్తల సమన్వయంపై దిశానిర్దేశం చేశారు. పేదల సొంతింటి కలను నెరవేర్చే ఈ కార్యక్రమాన్ని అందరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలన్నారు.