హీరో ప్రియదర్శి చేతుల మీదుగా 'అర్థమయ్యిందా అరుణ్ కుమార్' వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ 'ఆహా' వేదిక ఈ వెబ్ సిరీస్ జూన్ 30వ తేది నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కరోనా టైంలో థియేటర్లు మూతపడటం వల్ల ఓటీటీల హవా ఎక్కువైంది. ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో ఓటీటీల్లో ఎక్కువగా వెస్ సిరీస్‌లు రావడం మొదలైంది. ఆ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వేదిక మరో ఇంట్రెస్టింగ్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అర్థమయ్యిందా అరుణ్ కుమార్ అనే టైటిల్ తో ఈ సీరిస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘అర్థమయ్యిందా అరుణ్ కుమార్’ ట్రైలర్:
హర్షిత్ రెడ్డి, అనన్య ప్రధాన పాత్రల్లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ ను నియతి రూపొందించారు. జొనాథన్ ఎడ్వర్డ్స్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. అజయ్ అరసాడ సంగీతాన్ని అందించారు. ఈ వెబ్ సిరీస్ జూన్ 30వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. లవ్, కామెడీ, రొమాన్స్ ప్రధానంగా ఈ వెబ్‌సిరీస్ సాగనుందని మేకర్స్ తెలిపారు.
టాలీవుడ్ హీరో ప్రియదర్శి చేతుల మీదుగా అర్థమయ్యిందా అరుణ్ కుమార్ ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ..సినిమాల్లో అవకాశాల కోసం వచ్చి ఎదురుచూస్తున్నవారికి ‘ఆహా’ ఒక మంచి ఫ్లాట్ ఫామ్ అని అన్నారు. తాను కూడా ‘ఆహా’ ద్వారా మంచి సినిమాలు చేయగలిగినట్లు తెలిపారు. ఆహా సక్సెస్ స్టోరీలో తాను ఒక పార్ట్ అయినందుకు ఆనందంగా ఉందన్నారు.