»Dasara Villain Confirms His Presence On Ntrs Devara
Devara: ఎన్టీఆర్ దేవరలో దసరా విలన్..?
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా దేవర. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమా నుంచి తాజాగా ఓ కీలక అప్ డేట్ బయటకు వచ్చింది.
ఇటీవల నాని దసరా సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన మాలీవుడ్ నటుడు షైన్ టామ్ చాకో దేవరలో ఎన్టీఆర్ తో తలపడనున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా కన్ఫామ్ చేశాడు. ఎవరో ఆయన దేవరలో నటిస్తున్నాడు అంటూ పోస్టర్ పెట్టగా, దానిని ఆయన తన సోషల్ మీడియాలో ఎకౌంట్ లో షేర్ చేసుకున్నాడు. దీంతో ఆయన అందులో నటిస్తున్నాడు అనే విషయం కన్ఫామ్ అయిపోయింది.
దసరా మూవీలో ఆయన విలనిజం బాగా పండించాడు. ఇక యుువ హీరో నాగ శౌర్య రంగబలిలో కూడా విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇక దేవర సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మోస్ట్ వైలెంట్ సినిమా అనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల విడుదలైన పోస్టర్ లో ‘సముద్రం నిండా అతని కథలు రక్తంతో రాసి ఉన్నాయి’ అని రాసి ఉంది. దీనిని బట్టే, ఇంది ఎంత వైలెంట్ గా ఉంటుందో తెలుస్తోంది. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా. జాన్వీ కపూర్ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు.