కన్నడ సూపర్ స్టార్ యష్ కేజీఎఫ్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ మూవీతో ఆయన ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయారు. అయితే, ఆ మూవీ తర్వాత ఆయన మళ్లీ కొత్త సినిమా ఏమీ చేయలేదు. దీంతో, ఆయన తన కొత్త సినిమా గురించి ఎప్పుడు ప్రకటిస్తాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన కొత్త మూవీ ఆలస్యం కావడానికి గల కారణాన్ని తెలియజేశారు.
తన భార్య రాధిక పండిట్, పిల్లలతో కలిసి మైసూర్ పర్యటన సందర్భంగా యశ్ మీడియాతో మాట్లాడారు. అతను తన రాబోయే ప్రాజెక్ట్ యష్ 19 గురించి మాట్లాడాడు.కేజీఎఫ్ తర్వాత తన బాధ్యత మరింత పెరిగిపోయిందని, అంచనాలు కూడా ఎక్కువగా ఉన్నాయని అందుకే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుకు తాను విలువ ఇస్తానని యష్ నొక్కిచెప్పారు. ‘నా తరువాత చిత్రం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుందని తెలుసు. దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
ప్రేక్షకుల అంచనాలను అందుకోవాల్సిన బాధ్యత నాపై వుంది. ఇకపై ఆలస్యం చేయను.తొందర్లోనే నేను నటించబోయే సినిమాకు సంబంధించిన డిటైల్స్ తెలియజేస్తాను’ అన్నారు. ఇక, బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందా అని మీడియా వారు అడగ్గా యష్ అయితే దానికి మాస్ రిప్లై ఇవ్వడం వైరల్ గా మారింది. నేనెక్కడికి వెళ్లను అని అందరినీ నేనున్న చోటుకే రప్పిస్తా అని సమాధానం ఇచ్చాడు. దీనితో ఈ క్రేజీ అండ్ మాస్ రిప్లై అయితే ఫ్యాన్స్ లో వైరల్ గా మారగా తాను బాలీవుడ్ లోకి అయితే వెళ్ళను అని కూడా క్లారిటీ ఇచ్చేసారు.