KMR: డిగ్రీ కళాశాల సమస్యలపై కలెక్టరేట్లో ఏవోకికి గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. పది రోజుల క్రితం డిగ్రీ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. కళాశాలను ముట్టడించిన అనంతరం ప్రిన్సిపల్ విజయ్, ప్రిన్సిపల్ కిష్టయ్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ముఖం చాటేసారని, సంబంధిత అధికారులను సస్పెండ్ చేసి డిగ్రీ కళాశాల సమస్యలను పరిష్కరించాలని కోరారు.