అనంతపురం-హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థ (అహుడా) పరిధిలో అందుతున్న గ్రీవెన్స్ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని సెక్రటరీ జి.రామకృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం అహుడా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అహుడా పీవో ఇషాక్, ఇంజనీర్ దుష్యంత్, ఈవో అరుణ కుమారి సహా ఇతర సిబ్బంది పాల్గొన్నారు.