NRPT: మాగనూరు మండల కేంద్రంలో చైనా మాంజా విక్రయాలను అరికట్టేందుకు శనివారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎస్సై అశోక్ బాబు ఆధ్వర్యంలో పతంగులు విక్రయించే దుకాణాలను విస్తృతంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రాణాపాయానికి కారణమయ్యే చైనా మాంజాను విక్రయించినా, నిల్వ ఉంచినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.