KRNL: నగరంలోని ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల తొలగింపును మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా ఆదివారం 2వ విడతగా విస్తృత స్వచ్ఛత పనులు చేపడుతున్నట్లు నగర కమిషనర్ పీ.విశ్వనాథ్ తెలిపారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య తనిఖీదారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచే ప్రత్యేక డ్రైవ్‌ను 4వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ప్రారంభిస్తామన్నారు.