VKB: తాండూరు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎం. వర్షితకు కామారెడ్డిలో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో మొదటి బహుమతి వచ్చింది. బయో ప్లాస్టిక్ విభాగంలో ఈమెకు ఈ బహుమతి దక్కింది. ఈనెల 18న జరిగే జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్‌కు వర్షిత ఎంపికైంది. ఆమెకు పాఠశాల కరస్పాండెంట్ గణేష్ కుమార్, ప్రిన్సిపల్ వెంకటేష్, డైరెక్టర్ సుజాత అభినందనలు తెలిపారు.