కృష్ణా: బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామ రాజకీయాల్లో సుదీర్ఘకాలం సేవలందించిన సీనియర్ నాయకుడు యనమదల వెంకయ్యారావు శుక్రవారం అర్ధరాత్రి అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. 14 ఏళ్లు గ్రామ సర్పంచ్‌గా, ఒకసారి MPTCగా, అలాగే 14 ఏళ్లపాటు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతి పట్ల గ్రామ ప్రజలు, పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.