KNR: కరీంనగర్ దుర్షేడ్ గ్రామం వద్ద విషాదం నెలకొంది. ఓ స్కూల్ వ్యాన్ ఢీకొనడంతో కిసాన్ నగర్‌కు చెందిన శశికుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆగ్రహించిన బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేస్తున్నారు. న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.