ASF: సంక్రాంతి పండుగ వేళ పతంగులు ఎగురవేసే విషయంలో ప్రజలు, ముఖ్యంగా చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని SE ఉత్తమ్ జాడే సూచించారు. విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో పతంగులు ఎగురవేయడం ప్రాణాపాయానికి దారితీస్తుందని హెచ్చరించారు. విద్యుత్ లైన్లకు పతంగులు చిక్కుకున్నప్పుడు వాటిని తీసే ప్రయత్నం చేయవద్దని కోరారు.