ASF: సంక్రాంతి సెలవులకు ఊరికి వెళ్లే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ASF జిల్లా ఎస్పీ నితికా పంత్ సూచించారు. నగలు, విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచాలని, ఇంటికి బలమైన సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడాలని చెప్పారు. ప్రయాణ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దన్నారు. సీసీ కెమెరాల ద్వారా ఇంటిని పర్యవేక్షించాలన్నారు.