AP: పార్టీ కేంద్ర కార్యాలయంలో CM చంద్రబాబు చిట్‌చాట్ నిర్వహించారు. నాగరికత తెలిస్తే నదుల గురించి జగన్ దుష్ప్రచారం చేయరని అన్నారు. ‘సింధూ నాగరికత గురించి జగన్ తెలుసుకుంటే మంచిది. ఢిల్లీ సహా అనేక ప్రధాన నగరాలు నదీతీరాల పక్కనే ఉన్నాయి. లండన్ సహా ప్రపంచంలోని ప్రముఖ నగరాలు నదీతీరాల్లోనే ఉన్నాయి. నదీగర్భం, నదీపరివాహక ప్రాంతానికి తేడా జగన్‌కు తెలియదు’ అని విమర్శించారు.