TG: పెట్టుబడుల పేరుతో మాజీ IPS భార్యను సైబర్ నేరగాళ్లు దాదాపు రూ.2.58 కోట్లు మోసం చేశారు. బాధితురాలి భర్త గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించారు. వాట్సాప్లో నేరగాళ్లు పంపించిన నకిలీ సెబీ సర్టిఫికేట్లు, ప్రకటనలు నమ్మి డిసెంబర్ 24 నుంచి ఈనెల 5 వరకు మాజీ IPS భార్య లావాదేవీలు నిర్వహించారు. మొత్తం 19 లావాదేవీల్లో రూ.2.58 కోట్లను పంపించారు.