AKP: ఎస్ రాయవరం మండలం వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా వియ్యపు సింహాద్రి నియమితులయ్యారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కమిటీ ఆయనను ఆ పదవిలో నియమించింది. మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సింహాద్రి శనివారం తెలిపారు. తనకు అవకాశం కల్పించిన నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కంబాల జోగులుకు కృతజ్ఞతలు తెలియజేశారు.